గ్రామీణ ప్రతిభకు బంగారు వేదిక… రాంపూర్‌లో హాకీ సమ్మర్ క్యాంప్ జోష్!
Views: 2
On
హుజురాబాద్ టౌన్ మే 04 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం క్రీడా కాంతులతో కళకళలాడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఉచిత హాకీ వేసవి శిక్షణ శిబిరం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ హాకీ కోచ్ పల్లపు సాంబరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని సర్పంచ్ ముషం సంగీత, గణేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… “గ్రామీణ క్రీడాకారులకు సరైన దారి, శిక్షణ ఇస్తే వారు రాష్ట్రం, దేశం స్థాయిలో మెరిసే సామర్థ్యం కలిగినవారే” అని నమ్మకంగా చెప్పారు. వేసవి శిబిరాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు భావన, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు.
ప్రస్తుతం శిబిరంలో పాల్గొంటున్న బాలురు, బాలికలు ప్రతిరోజూ హాకీ ప్రాథమిక నైపుణ్యాలు, ఫిట్‌నెస్, ఆట నియమాలపై కఠినంగా శిక్షణ పొందుతున్నారు. కోచ్ సాంబరాజు మార్గదర్శకత్వంలో పిల్లల్లో క్రీడాస్ఫూర్తి మరింత పెరుగుతోంది.
క్రీడాకారులకు అండగా దాతలు
శిబిరానికి మరింత ఉత్సాహం నింపుతూ పలువురు దాతలు ముందుకు వచ్చారు. మాటూరి సారయ్య జ్ఞాపకార్థం ఆయన మనవరాలు అవిజ్ఞ సుహాసిని 15 టీషర్ట్లు అందించగా, సీనియర్ క్రీడాకారుడు భూసారపు శంకర్ మరో 15 టీషర్ట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ కార్యదర్శి బొడిగ తిరుపతి, పీఈటీలు వేముల రవికుమార్, సాదుల శ్యామ్ కుమార్, సీనియర్ క్రీడాకారులు సజ్జు, రాజు, రాజేష్, సాయి కృష్ణ, ఉప సర్పంచ్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.
రాంపూర్‌లో ప్రారంభమైన ఈ హాకీ శిబిరం… చిన్నారుల కలలకు పెద్ద దారిని చూపిస్తోంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 17:01:04
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...


Comments