కాషాయ గర్జనతో మారుమోగిన ఎల్కతుర్తి.

కాషాయ గర్జనతో మారుమోగిన ఎల్కతుర్తి.

ఎల్కతుర్తి, మే 04( తెలంగాణ ముచ్చట్లు):
 
 పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, టపాసులు పేల్చుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమే ఈ విజయానికి కారణమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు పెరుగుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, “మోదీ గారి అభివృద్ధి పథకాలు, అమిత్ షా గారి వ్యూహరచన వల్లనే బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. భవిష్యత్తులో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కుడుతాడు చిరంజీవి, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య,  వెంకటేష్, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీవర్ధన్, చిదురాల వెంకటేష్, పల్లెపాటి మధుకర్ రావు, మాజీ సర్పంచ్ కడారి ప్రసాద్, నాంపల్లి అశోక్, పెరుగు మధు, కొడం రమేష్, చెదిరం రాకేష్, ఎర్రోళ్ల రాజు, కొలిపాక శ్రీనివాస్, మాటూరి విద్యాసాగర్, రంజిత్, శ్రీనివాస్, దేవరావు, సుఖినే సుధాకర్ రావు, కోమటిపల్లి నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260504-WA0236
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .