వంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

ఏఐకేఎస్ డిమాండ్.

వంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

ఖమ్మం బ్యూరో, మే 4(తెలంగాణ ముచ్చట్లు )
 
పాతర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో పంట కాలిపోయిన మొక్కజొన్న రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎస్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు ఏపూరి రవీంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాతర్లపాడు గ్రామంలో ఏఐకేఎస్ చింతకాని మండల ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఏపూరి రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యంతోనే మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొనుగోలు కేంద్రాల పేరుతో రైతులను దగా చేస్తున్నారన్నారు. బస్తాలు మొదలుకొని, కాటాలు, చివరకు లారీల వరకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేసవి కాలం కావడంతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుంటే రైతులు రాత్రిళ్ళు సైతం కాటాలు వేసిన బస్తాలకు కావిలి కాయల్సివస్తుందన్నారు. కాటాలు వేసిన బస్తాలను గోడౌన్కు తరలించడానికి బస్తాకు రూ.40 నుంచి 50 వరకు డిమాండ్ చేస్తున్నారని దీంతో గత్యంతరం లేక రైతులు చెల్లిస్తున్నారని, పాతర్లపాడులో జరిగిన ప్రమాదంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తక్షణమే అధికారులు పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి పంపి నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. తక్షణమే అధికారులు స్పందించి కాటాలు వేసిన మొక్కజొన్నను గోడౌన్ కు తరలించాలని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో గొర్రెలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని గొర్రెల కాపరికి కూడా నష్టపరిహారం అందేలా చూడాలని లేని పక్షంలో రైతులు తరపున ఏఐకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పావులూరి మల్లిఖార్జునరావు, ఏఐకేఎస్ మండల కార్యదర్శి పదిమల వెంకటనర్సయ్య, నాయకులు తాళ్లూరి యాదగిరి, కొత్తపల్లి రమేష్, గడ్డం సీతారామారావు తదితరులు పాల్గొన్నారు
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .