రెండు ఏళ్ల సేవలకు గౌరవం… కమిషనర్ అయాజ్‌కు సత్కారం.

రెండు ఏళ్ల సేవలకు గౌరవం… కమిషనర్ అయాజ్‌కు సత్కారం.

జమ్మికుంట టౌన్ మే 04 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట మున్సిపాలిటీలో గత రెండు సంవత్సరాలుగా సేవలు అందిస్తూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందజేసి ఆయనను సత్కరించారు. కమిషనర్‌గా ఉన్న కాలంలో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ముఖ్యంగా ఇంటి పన్ను వసూళ్లలో జమ్మికుంటను రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు ముందంజలో నిలిపిన నాయకత్వం ఆయనదేనని అభినందించారు.
ఈ సందర్భంగా తోటి అధికారులు మాట్లాడుతూ, అధికారి అయినప్పటికీ సిబ్బందితో స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా మెలిగి అందరినీ ఒక కుటుంబంలా చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. తమ పనిని గుర్తించి ప్రోత్సహిస్తూ అవార్డులు అందించారని తెలిపారు. ఆయన సేవలు ఎప్పటికీ మరువలేమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, జె.ఏ.ఓ రాజశేఖర్ రెడ్డి, టిపివో శ్రీధర్, టిపిఎస్ రాజ్ కుమార్, ఆర్‌ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్లు వాణి, శ్రీనివాస్, ఫష్ బోలా సదానందం తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .