42 రోజుల పోరాటానికి బ్రేక్…
సిరిసపల్లి డంపింగ్ యార్డ్ ఉద్యమం తాత్కాలిక విరమణ .
Views: 5
On
హుజురాబాద్ మే 3(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లిలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు సాగించిన ఉద్యమం 42 రోజుల తర్వాత తాత్కాలికంగా ఆగింది. ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో జేఏసీ నాయకులు నిరాహార దీక్షను విరమించారు.
కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రణవ్ బాబు విజ్ఞప్తి మేరకు దీక్ష శిబిరాన్ని తొలగించారు. అయితే భవిష్యత్తులో మళ్లీ ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తీసుకొస్తే భారీ స్థాయిలో ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని గ్రామస్తులు గట్టిగా హెచ్చరించారు.
ప్రజల ఐక్యత, దీక్షతో సాగిన ఈ పోరాటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments