సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా.

గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్.

సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా.

ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు): 
 
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త ఆశలను నింపింది. గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు యూరియా వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా భూమి సారం పెరుగుతుందని, దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకమని చెప్పారు. భూసార పరీక్షల ద్వారా భూమి నాణ్యతను తెలుసుకుని, తగిన పద్ధతులు పాటిస్తే దిగుబడులు మెరుగవుతాయని సూచించారు.
సర్పంచ్ గొలిపెల్లి సంపత్ మాట్లాడుతూ “వ్యవసాయం బలపడితేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. రైతులు సహజ పద్ధతులు, పంటల మార్పిడి, నీటి సంరక్షణ వంటి విధానాలను పాటిస్తే ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది” అని తెలిపారు. గ్రామంలో రైతులకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సేంద్రియ సాగును ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు శాస్త్రవేత్తలు సూచించిన మార్గాలను అనుసరిస్తామని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తామని తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .