రైతులకు కల్టివేటర్లు, డ్రోన్ల పంపిణీ.

రైతులకు కల్టివేటర్లు, డ్రోన్ల పంపిణీ.

- సేంద్రీయ సాగుతోనే భూమి సారం కాపాడగలం. 
- ఎమ్మెల్యే రాగమయి.
 
సత్తుపల్లి, మే 7(తెలంగాణ ముచ్చట్లు):
 
తెలంగాణ ప్రభుత్వం సహకార, వ్యవసాయ, విద్యుత్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా రైతు వారోత్సవం సందర్భంగా తల్లాడ మండలం గంగాదేవిపాడు గ్రామంలోని పీఏసీఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారం తగ్గిపోవడంతో పాటు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఆధునిక సాంకేతికతతో కూడిన సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని కోరారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆమె, రైతులకు కల్టివేటర్లు, డ్రోన్లు అందుబాటులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రైతులకు కల్టివేటర్లు, డ్రోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులు, తల్లాడ మండల సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.IMG-20260507-WA0061IMG-20260507-WA0062
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .