లేబర్ కార్డు రెన్యువల్ తప్పనిసరి .

ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్

లేబర్ కార్డు రెన్యువల్ తప్పనిసరి .

హుజురాబాద్, మే 06(తెలంగాణ ముచ్చట్లు ):
 
కార్మికులు తమ లేబర్ కార్డులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్ సూచించారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో మే డే ఉత్సవాల సందర్భంగా కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలంటే లేబర్ కార్డు చెల్లుబాటు ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. గడువు ముగిసిన కార్డులను వెంటనే పునరుద్ధరించుకోవాలని కార్మికులకు సూచించారు.
రెన్యువల్ చేయించుకోని పక్షంలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్మికులు తమ సమస్యలను నేరుగా కార్మిక శాఖ అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఇంచార్జ్ కార్మిక శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మధు, నాయకులు కోయల్కర్ బాలాజీ, సామాజిక కార్యకర్త నలబాల వేణుగోపాల్‌తో పాటు వివిధ సంఘాల కార్మిక నేతలు, కార్మికులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .