కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్ఎస్‌లో చేరిన మనిగిళ్ల గ్రామ నాయకులు.
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
Views: 2
On
పెద్దమందడి,మే6(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంచరమోని వెంకటయ్య, సుంచరమోని తిరుపతయ్య, పెద్ది రాఘవేందర్ సాగర్‌లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకుని బీఆర్ఎస్‌లో చేరగా, ఆయన వారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి పలువురు నాయకులు తిరిగి బీఆర్ఎస్ వైపు వస్తున్నారని అన్నారు.కార్యక్రమంలో మనిగిళ్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 May 2026 17:38:11
ఎల్కతుర్తి, మే 07( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు మాచర్ల అశోక్ అనారోగ్యంతో కిడ్నీ ఫెయిల్ కావడంతో...


Comments