గుంతలమయమైన బీటీ రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా మారిన మార్గం.
Views: 6
On
ముందరితండా–చిన్నమందడి–దొడగుంటపల్లి రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్
పెద్దమందడి,మే6(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ముందరి తండా నుంచి చిన్నమందడి, దొడగుంటపల్లి గ్రామాలకు వెళ్లే బీటీ రహదారి అధ్వాన్నంగా మారింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రహదారిపై గుంతలు ఏర్పడటంతో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఎదురెదురుగా వచ్చే వాహనాలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.రాత్రి సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని పేర్కొన్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న బీటీ రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments