బక్రీద్ పండుగను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలి.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ .
Views: 15
On
ఖమ్మం బ్యూరో, మే 5(తెలంగాణ ముచ్చట్లు )
బక్రీద్ పండుగను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను పురస్కరించుకొని శాంతియుతంగా జరుపుకునేందుకు ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు,ఖురేసి ప్రతినిధులతో పోలీస్ యంత్రాంగం సమన్వయ సమావేశం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... గోవధ చేయవద్దని, కేవలం అనుమతించబడిన జంతువులను మాత్రమే, నిబంధనలకు లోబడి బలి ఇవ్వాలని సూచించారు.
అక్రమ పశువుల రవాణాను అరికట్టడానికి అంతర్-రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. పశువులను తరలించేటప్పుడు సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండటం తప్పనిసరి అని అన్నారు. ప్రార్థనా స్థలాలు, మసీదుల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు, నిరంతర నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వార్తలు, వదంతులు ప్రజలు నమ్మవద్దని, అలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బలి ఇచ్చిన తర్వాత జంతు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా, మున్సిపల్ అధికారుల సహకారంతో తొలగించే చర్యలు తీసుకోవాలని మత పెద్దలను కోరారు. ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే సంబంధిత పోలీసులకు, కమాండ్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 కు సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే పోలీస్ అధికారులు దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో ఏసీపీ రమణమూర్తి, మహేష్, సిఐ కరుణాకర్, మోహన్ బాబు, బాలకృష్ణ, ఎస్సై మౌలానా పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments