అకాల వర్షం దెబ్బకు రైతన్నకు దెబ్బ – కళ్లముందే పంట నీటిపాలు.

అకాల వర్షం దెబ్బకు రైతన్నకు దెబ్బ – కళ్లముందే పంట నీటిపాలు.

హుజురాబాద్ మే 5(తెలంగాణ ముచ్చట్లు ):
 
మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షం రైతన్నలను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ గ్రామాల్లో కోత కోసి కళ్లల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన వేళ కళ్లముందే నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకస్మికంగా కురిసిన వర్షంతో ధాన్యాన్ని కాపాడుకునే అవకాశమే లేకపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యం నాణ్యత తగ్గిపోవడంతో మార్కెట్‌లో ధరలు కూడా తగ్గే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.IMG-20260505-WA0135
ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .