రైతులను మోసం చేసిన బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు.

కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి .

రైతులను మోసం చేసిన బీఆర్ఎస్‌కు మాట్లాడే హక్కు లేదు.

వనపర్తి,మే7(తెలంగాణ ముచ్చట్లు):

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల పేరుతో సభలు నిర్వహించడం దురదృష్టకరమని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.గురువారం వనపర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ, ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని ఆరోపించారు. ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేయడం, ప్రాజెక్టు ముంపు బాధితులపై లాఠీచార్జీలు చేయించడం, ధరణి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలేనన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, 28 నెలల్లో రూ.1.52 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసిందని తెలిపారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వరిధాన్యానికి బోనస్, పంట నష్టపరిహారం వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తోందన్నారు.రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని, కేటీఆర్ అహంకారం విడిచిపెట్టి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కిసాన్ సెల్ నాయకులు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .