ఆటో కార్మికుడి మృతితో విషాదం  కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఆటో కార్మికుడి మృతితో విషాదం  కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఎల్కతుర్తి, మే 07( తెలంగాణ ముచ్చట్లు):
 
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు మాచర్ల అశోక్ అనారోగ్యంతో కిడ్నీ ఫెయిల్ కావడంతో మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన హుజురాబాద్ డివిజన్ స్వశక్తి ఆటో యూనియన్ సభ్యులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ డివిజన్ ఆటో యూనియన్ అధ్యక్షులు శనిగరపు రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కిరాయిలు లేక కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఆటో డ్రైవర్లకు ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని, పలువురు ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
మృతుడు మాచర్ల అశోక్‌కు భార్య స్పందనతో పాటు ఇద్దరు కుమారులు విశ్వేశ్ (12), వరుణ్ తేజ్ (10) ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దండేపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు మాచర్ల శంకర్, ఉపాధ్యక్షుడు పొంగ ప్రవీణ్, కార్యదర్శి చిర్ర కుమారస్వామి, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .