డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం : సొల్లు బాబు

డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం : సొల్లు బాబు

హుజురాబాద్,మే (తెలంగాణ ముచ్చట్లు ):

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు విమర్శించారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని ప్రజలకు హామీలు ఇచ్చారని, ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
లీటర్‌కు పెట్రోల్‌పై రూ.3.40, డీజిల్‌పై రూ.3.27 పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఇంధన ధరల పెంపుతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తూ పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సొల్లు బాబు హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .