పామిరెడ్డిపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు.
Views: 2
On
పెద్దమందడి,మే12(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు.రెండో రోజు నిర్వహించిన కార్యక్రమాల్లో ఆంజనేయస్వామికి అభిషేకం, హోమం, పూర్ణాహుతి, చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ మధిర మంజుల, మండల మాజీ ఎంపీపీ మనేపురెడ్డి సుగుణమ్మ హోమ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భజన మండలి భక్తులు లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, లక్ష్మణ్ గౌడ్, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
12 May 2026 21:51:43
*సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్*
*మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దంటూ హెచ్చరిక*
*ప్రజల భద్రతే మా బాధ్యత*
మంచిర్యాల,మే12 (తెలంగాణ ముచ్చట్లు)
మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలో...


Comments