డిజిటల్ విద్యతో ప్రభుత్వ బడిలో నూతన అధ్యాయం.

డిజిటల్ విద్యతో ప్రభుత్వ బడిలో నూతన అధ్యాయం.

ఎల్కతుర్తి, మే 14 (తెలంగాణ ముచ్చట్లు):
 
తెలంగాణ విద్యా వారోత్సవాల సందర్భంగా దండేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం బడిబాట ర్యాలీతో పాటు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రమేష్ బాబు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గొలిపెల్లి సంపత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం డిజిటల్ విద్యకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. ఇంటారాక్టీవ్ ఫ్లాట్ పానల్స్ ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన జరుగుతోందని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ బడుల్లోనూ ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే ఇదే పాఠశాలలో చదివి ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజినీర్లు, పోలీసులు వంటి ఉన్నత స్థాయిలో స్థిరపడిన వారు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక ఉచిత సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు.
అనంతరం ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించి విద్యార్థుల చేర్పుపై అవగాహన కల్పించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .