ఏకగ్రీవంగా కోరపల్లి మత్స్యకారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక.

ఏకగ్రీవంగా కోరపల్లి మత్స్యకారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక.

జమ్మికుంట టౌన్ మే 10 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగి ఏకగ్రీవంగా ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు సమన్వయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
సంఘం అధ్యక్షునిగా పింగిలి రమేష్ (స్వామి కుమారుడు), ఉపాధ్యక్షునిగా టంగుటూరి రామ్మోహన్, కార్యదర్శిగా మద్దెర్ల రమేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. డైరెక్టర్లుగా కొండవేనా పోషాలు, టంగుటూరి సంజీవ్, పింగిలి సంపత్, టంగుటూరి ఉమేష్, తీగల మల్లేష్, టంగుటూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ఎన్నికల ప్రక్రియను జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీమతి అరుణ జ్యోతి ఎన్నికల అధికారిగా పర్యవేక్షించివిజయవంతంగా నిర్వహించారు. IMG-20260510-WA0279 గ్రామ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. ఎన్నికైన సభ్యులకు గ్రామ ప్రజలు, మత్స్యకార సంఘ సభ్యులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .