తిరిగి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సింగిల్ విండో పాలకమండలి.

హర్షం వ్యక్తం చేసిన అధ్యక్షులు, డైరెక్టర్లు.

తిరిగి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సింగిల్ విండో పాలకమండలి.

పెద్దమందడి,మే8(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి వ్యవసాయ  సింగిల్ విండో పాలకమండలి సమావేశం శుక్రవారం నిర్వహించారు.ఇటీవల సింగిల్ విండో పాలకమండలిని ప్రభుత్వం రద్దు చేయగా, ఆ నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువడింది.అనంతరం తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించిన పాలకమండలి సభ్యులు సమావేశం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం పాలకమండలి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.సహకార సంఘాల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు మాట్లాడుతూ.. తిరిగి బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.రైతుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.సమావేశంలో సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్, పాలకమండలి సభ్యులు నరేష్, రామ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుందరమ్మ, వెంకటయ్య, మన్నెంకొండ,సీఈవో సుధాకర్, సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .