పెద్దమందడిలో నేడు పశు ఆరోగ్య శిబిరం.
పెద్దమందడి మండల పశువైద్యాధికారి శ్యాంసుందర్ నాయక్ .
Views: 7
On
పెద్దమందడి,మే7(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పెద్దమందడి ప్రాథమిక పశువైద్యశాలలో నేడు ఉదయం 8 గంటలకు పశు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల పశువైద్యాధికారి శ్యాంసుందర్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు, చూడి పరీక్షలు నిర్వహించడంతో పాటు మేలు జాతి దూడల ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు.అలాగే దూడలకు నట్టల నివారణ మందులు త్రపించడం, పశుగ్రాస విత్తనాల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.వేసవి కాలంలో పశు సంరక్షణ చర్యలు, పశుగ్రాసం పెంపకంపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్లు శ్యాంసుందర్ వెల్లడించారు.గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు, పత్రిక విలేకరులు ఈ కార్యక్రమానికి సకాలంలో హాజరై సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments