ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్  నిందుతుడిని అదుపులోకి తీసుకొన్న కొణిజర్ల పోలీసులు .

వైరా ఏసీపీ సారంగపాణి.

ఖమ్మం బ్యూరో, మే 7(తెలంగాణ ముచ్చట్లు )
 
కొణిజర్ల మండల పరిధిలోని తనికెళ్ల గ్రామంలో అక్రమంగా ఐపీఎల్-2026 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందుతుడిని కొణిజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. తనికెళ్ల గ్రామంలోని అమ్మ టిఫిన్ సెంటర్ వద్ద ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సూరజ్ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారన్నారు. ప్రధాన నిర్వాహకుడు గుగులోత్ వెంకటేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందుతుడు వద్ద నుండి రూ.3,000 నగదు, బెట్టింగ్‌కు సంబంధించిన 8 రాతపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగతా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారన్నారు. 
దర్యాప్తులో నిందితులు మొబైల్ ఫోన్ కాల్స్ ద్వారా ఆఫ్‌లైన్ విధానంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైందన్నారు. బెట్టింగ్‌లో పాల్గొన్న వారి నుండి డబ్బులు సేకరించి, మ్యాచ్‌లు పూర్తైన తర్వాత కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని విజేతలకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 103/2026 కింద తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 
ఇటువంటి అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .