జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె.
Views: 4
On
హుస్నాబాద్. మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
హుస్నాబాద్ మండలం మాలపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మాలపల్లె గ్రామ సర్పంచ్ శ్రీమతి వెన్న స్వర్ణలత – రాజు దంపతులు మంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు, చల్ల పాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా గ్రామ శాఖ అధ్యక్షురాలు సొల్లు స్వప్న సాయిలు మాట్లాడుతూ ప్రజా సేవలో నిరంతరం ముందుండే నాయకుడు పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు. యువజన మండల కార్యదర్శి వెన్న మల్లికార్జున్ మాట్లాడుతూ మంత్రి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తలు “జై పొన్నం – జై కాంగ్రెస్” నినాదాలతో గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా మంత్రి గుర్తింపు పొందారని పలువురు నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బత్తుల వీరస్వామి, కవిత, వెన్న శారద, సొల్లు రామస్వామి, బత్తుల సారయ్య, భోజ అంజయ్య, బత్తుల కిషన్, శనిగరపు గోపాల్, గొల్లపల్లి వినోద్, నరసయ్య, బత్తుల కనకయ్య, వెన్న శ్రీరామ్, అక్షిత తదితరులు పాల్గొన్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments