గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన.

గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన.

దమ్మపేట, మే 7(తెలంగాణ ముచ్చట్లు):

కేంద్ర ప్రభుత్వం పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను నిరసిస్తూ సీపీఎం దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముద్దులగూడెం గ్రామంలోని ఎన్టీఆర్ రింగ్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.900, వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.3000 వరకు ధరలు పెంచడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మీనారాయణ, గ్రామ కార్యదర్శి చెన్నుపోయిన బ్రహ్మయ్య, నరుకుల వెంకటేశ్వరరావు, కూచిపూడి రవి, ఎస్.కె. నవి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .