గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

* ​నిధుల్లో అత్యధిక భాగం మారుమూల ప్రాంతాలకే కేటాయిస్తా

* ​మధిర, బోనకల్ మండలాల్లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత పర్యటన

* రూ.52లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

ఖమ్మం బ్యూరో, మే 7(తెలంగాణ ముచ్చట్లు )

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. గురువారం ఆయన మధిర, బోనకల్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రూ.52లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన పనులను ప్రారంభించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు కేటాయించే నిధుల్లో అత్యధిక భాగాన్ని గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి కేటాయిస్తానని ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాంగ్రెస్ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని, తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
*పర్యటన ఇలా..*
బోనకల్ మండలంలోని తూటికుంట్ల గ్రామంలో రూ.5 లక్షలతో రెండు సిసి రోడ్లకు, చిరునోములలో రూ.4.50 లక్షలు, పెద్ద బీరవల్లిలో 4 లక్షలు, చిన్నబీరవల్లిలో 4.50 లక్షలు మరియు రాపల్లిలో రూ.4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ముష్టికుంటలో రూ.5 లక్షలు, బోనకల్ మండల కేంద్రంలో రూ.5 లక్షలతో పూర్తయిన రోడ్లను ఆయన ప్రారంభించారు. 
*మధిర మండలంలో...+* మధ్యాహ్నం అనంతరం మధిర మండలంలో పర్యటించి వంగవీడులో రూ.5 లక్షలు, నిధనపురంలో 5 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించగా, సిరిపురంలో రూ.5 లక్షలు మరియు రాయపట్నంలో 5 లక్షల రూపాయలతో చేపట్టనున్న కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. ఒకే రోజు మొత్తం 12 ప్రాంతాల్లో సుమారు రూ. 52 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పల్లెల్లో ప్రగతి పరుగులకు బాటలు వేశారు.
*ఈ కార్యక్రమాల్లో..:* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ కోటా రాంబాబు, మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు పైడిపల్లి కిషోర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, 
 సర్పంచులు తాళ్లూరి లక్ష్మీ నరసయ్య, పిల్లలమర్రి నాగేశ్వరరావు, అనుమోలు చంద్రకళ, బానోత్ జ్యోతి, చింతలచెరువు కోటేశ్వరావు, తాళ్లూరి వెంకట్రావమ్మ, నాయకులు సాదినేని రాంబాబు, కన్నేటి సురేష్, బోయినపల్లి మురళి, నరసయ్య శాస్త్రి, సైదా నాయక్, బండి వెంకట్రావ్, గొడుగు కృష్ణ, కొరివి సురేష్, చింతపట్ల నరేష్, భాగం నాగేశ్వరరావు, తోటకూర వెంకటేశ్వరరావు, నవోత్తమ రెడ్డి, కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షులు, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె. జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె.
హుస్నాబాద్. మే 08 (తెలంగాణ ముచ్చట్లు):   హుస్నాబాద్ మండలం మాలపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను...
తిరిగి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సింగిల్ విండో పాలకమండలి.
పెద్దమందడి సింగిల్ విండో నూతన సీఈఓ సుధాకర్‌కు ఘన సన్మానం.
జగత్‌పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్‌ను పరామర్శించిన డా. జిల్లెల ఆదిత్యరెడ్డి.
“ప్రజాస్వామ్యాన్ని దాడులతో అణిచేయలేరు”… కాంగ్రెస్ నేత ఆర్‌ఎస్ గౌడ్ ఫైర్.
కోతుల బెడదకు చెక్.. హుజూరాబాద్ ప్రజలకు ఊరట.
పేదరికాన్ని జయించి 'డాక్టర్‌' అయిన చైతన్య సాయి.