పెద్దమందడి సింగిల్ విండో నూతన సీఈఓ సుధాకర్‌కు ఘన సన్మానం.
Views: 4
On
పెద్దమందడి,మే8(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి వ్యవసాయ సింగిల్ విండో నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్‌ను పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. సింగిల్ విండో అభివృద్ధికి నూతన సీఈఓ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలని కోరారు.సీఈఓ సుధాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments