హైకోర్టు కేసుతో మీకేం సంబంధం.
Views: 3
On
*-ఆ కేసు టీడబ్ల్యూజేఎఫ్ కు సంబంధం*
*-టీడబ్ల్యూజేఎఫ్ తో బసవపున్నయ్య,రాంచందర్ లకు సంబంధం లేదు*
ఖమ్మం బ్యూరో,మే 07(తెలంగాణ ముచ్చట్లు )
రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలపై తాను హైకోర్టులో వేసిన కేసు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) యూనియన్ కే సంబంధం ఉందని, యూనియన్ నుంచి తనను ఎవరూ బహిష్కరించలేదనీ, టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను కోర్టు లో కేసు వేయడం జరిగిందని
ఆ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదంటున్న పిల్లి రాంచందర్, బసవపున్నయ్య అనే వ్యక్తులు తమ టీడబ్ల్యూజేఎఫ్ సంఘానికే సంబంధం లేరని, వారు తమ సంఘం నాయకులు కదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ యూనియన్ కు అక్రెడిటేషన్ కమిటీ ల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల కమిటీల్లో తమ వాయిస్ లేక చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తాను ప్రభుత్వం పై కేసు వేశానే తప్ప, జర్నలిస్టులకు అన్యాయం చేయడం కోసం కాదని అన్నారు. తమ యూనియన్ నుంచి తొలగించబడిన వ్యక్తులు స్వప్రయోజనాలు, వారి పత్రిక ప్రయోజనాలు పొందడం కోసం ప్రభుత్వంతో కుమ్మక్కై నాపై గోబెల్ ప్రచారం చేస్తున్నారని మామిడి సోమయ్య ఖండించారు. తాను ఒక జర్నలిస్టు యూనియన్ స్థాపించి గత 20 ఏళ్ళుగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న నాపై కొందరు కుట్రపన్ని యూనియన్ లో లేకుండా చేయాలనుకున్నారని, కానీ నావైపు ఉన్న మెజారిటీ జర్నలిస్టులు వాళ్ళ ఆటలు సాగనీయలేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మీడియా అక్రెడిటేషన్ల జీవో 252 ప్రకారం రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలని, లేదంటే కమిటీ నిర్ణయాలు అమలు కాకుండా చూడాలని కోరుతూ తాను హైకోర్టు ఆశ్రయించడం జరిగిందని తెలిపారు.తనను టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నుంచి బహిష్కరించినట్లు చట్టవిరుద్దమైన ప్రకటన చేసిన బసవపున్నయ్య, పిల్లి రాంచందర్ లపై కోర్టులో కేసు వేయడం జరిగిందని, అదేవిధంగా కార్మిక శాఖలో ఫిర్యాదు కూడా చేశామని పేర్కొన్నారు. అబద్దపు ప్రచారాలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని, తమ నేతృత్వంలోని టీడబ్ల్యూజేఎఫ్ కు కార్మిక శాఖ గుర్తింపు ఇచ్చిందన్న విషయం అవాస్తవమని అన్నారు.తాను కోర్టులో వేసిన కేసు పెండింగ్ లో ఉండగా కార్మిక శాఖ గుర్తింపు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. తప్పుడు ప్రచారంతో ఇటు జర్నలిస్టులను,
అటు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్దపు మాయ మాటలతో అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను మచ్చిక చేసుకొని తమ సంఘం ద్వారా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడబ్ల్యూజేఎఫ్ పైన గానీ, సంఘం వ్యవస్థాపకుల పైన గానీ మరోసారి తప్పుడు ప్రచారం చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మామిడి సోమయ్య హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 May 2026 17:26:57
హుస్నాబాద్. మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
హుస్నాబాద్ మండలం మాలపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను...


Comments