కోతుల బెడదకు చెక్.. హుజూరాబాద్ ప్రజలకు ఊరట.
Views: 5
On
హుజురాబాద్ మే 7(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ ప్రజలను ఏళ్ల తరబడి బెంబేలెత్తిస్తున్న కోతుల బెడదకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం మేరకు గురువారం కోతుల తరలింపు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ప్రారంభించారు.
2026-27 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.4 లక్షలు కేటాయించిన మున్సిపాలిటీ, పట్టణంలోని 30 వార్డుల్లో కోతులను పట్టించే చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు ప్రారంభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోతులు ఇళ్లపైకి ఎక్కడం, ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడం, చిన్నారులు మరియు వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయంతో పట్టణ ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లైంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments