ఖమ్మంకు క్రికెట్ కళకు "రఘురాం" కసరత్తు

ఖమ్మంకు క్రికెట్ కళకు

* ​స్టేడియం వేటలో ఎంపీ రామసహాయం 
* రఘునాథపాలెం మండలం జింకల తండా, ఖమ్మం రూరల్ తల్లంపాడు వద్ద ​స్వయంగా గుట్టల పైకి ఎక్కి స్థలాల పరిశీలన
 
ఖమ్మం బ్యూరో, మే 7(తెలంగాణ ముచ్చట్లు )
 
నగర సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కావాల్సిన సాధ్యాసాధ్యాలపై ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోరిక మేరకు..గురువారం ఆయన రఘునాధపాలెం మండలం జింకల తండా సమీపంలో గుట్టల ప్రాంతం, ఖమ్మం రూరల్ మండలం  తల్లంపాడు వద్ద హైవే వెంట ఉన్న కొండల ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలం కోసం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
*​శ్రమకోర్చి.. గుట్టపైకి*
స్టేడియం నిర్మాణానికి విశాలమైన, అనువైన భూమిని గుర్తించే క్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి శ్రమను లెక్కచేయకుండా రాళ్లు, రప్పలతో నిండిన గుట్టపైకి కాలినడకన ఎక్కారు. ఎగుడుదిగుడు మార్గాల గుండా ప్రయాణించి, గుట్టపై నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. ఖమ్మం క్రీడాకారుల కలల ప్రాజెక్టు అయిన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఎంపీ తెలిపారు. 
*ఈ పర్యటనలో...:* జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, రఘునాథపాలెం ఎమ్మార్వో ఎస్.శ్వేత, ఖమ్మం రూరల్ ఎమ్మార్వో విజయేందర్ రెడ్డి, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .