డిమాండ్ల సాధనకు వీఓఏల సమ్మె బాట.
Views: 69
On
- ఎమ్మెల్యే మట్టా రాగమయికి వినతిపత్రం.
- ఐదు మండలాల వీఓఏల డిమాండ్.
సత్తుపల్లి, మే 9(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలోని వీఓఏల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణ ఐకేపీ వీఓఏ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఐదు మండలాలకు చెందిన వీఓఏలు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా కమల్ పాషాకు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఐకేపీ వీఓఏ జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కమిటీ ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. వీఓఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఓఏలకు పదోన్నతులు కల్పించడంతో పాటు రూ.20 లక్షల ఆరోగ్య, సాధారణ భీమా సౌకర్యం అందించాలని కోరారు. విధుల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని, జీఓ నంబర్ 58ను సవరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని వీఓఏ నాయకులు కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments