చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం.
-- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
Views: 3
On
వనపర్తి,మే8(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పురపాలక మహిళా సంఘాలతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని, లారీలు, గన్నీ సంచుల కొరత వంటి సమస్యలు ఎదురైతే అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారని చెప్పారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రాజప్రకాశ్ రెడ్డి, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యారెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటేష్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామిగట్టు యాదవ్, చిన్న మందార సర్పంచ్ స్వరూప, శ్రీశైలం, రాధాకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments