పాపయ్యపల్లిలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.
Views: 3
On
జమ్మికుంట రూరల్ మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ శోభాయాత్రను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. “రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి” అనే నినాదాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ శోభాయాత్రలో శ్రీ అభయాంజనేయ ఉత్సవమూర్తిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై అధిరోహింపజేశారు. అనంతరం గ్రామంలోని పురవీధుల గుండా స్వామివారిని ఊరేగించారు.
హనుమాన్ మాలధారణ స్వాములతో పాటు మహిళలు డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, కోలాట నృత్యాలతో శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రథయాత్రను భక్తిశ్రద్ధలతో తిలకించారు.
ఈ కార్యక్రమంలో గురుస్వాములు గుండెకారి మధు, శంకర్‌తో పాటు మాలాధారణ స్వాములు వజ్జపళ్లి రాజు, కొల్లూరి రాకేష్, ఆరేపల్లి శివకృష్ణ, పవన్ కుమార్, మహేందర్, రాములు, సంతోష్, నరేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 May 2026 17:23:34
వేలేరు, మే 9(తెలంగాణ ముచ్చట్లు):
హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని షోడశపల్లి గ్రామానికి చెందిన కీర్తి కొమురయ్య ఉపాధి హామీ పథకం ( 100 )రోజుల పనిలో...


Comments