ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదాతలకు సన్మానం.
Views: 4
On
వనపర్తి,మే8(తెలంగాణ ముచ్చట్లు):
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి రెడ్‌క్రాస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్తదాతలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలు అందిస్తున్న గొప్ప స్వచ్ఛంద సంస్థ అని తెలిపారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేయడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు.1863లో హెన్రీ డునాంట్ రెడ్‌క్రాస్‌ను స్థాపించారని, ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు.రక్తదాన శిబిరాలు, వైద్య సేవలు, అంబులెన్స్ సేవల ద్వారా రెడ్‌క్రాస్ సమాజానికి విశేష సేవలు అందిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో గంధం నాగరాజు, డా. బండారు శ్రీనివాస్, శ్రీ మురళి, వసీం అక్రమ్, గోవిందు, శ్రీమతి లక్ష్మి, సంతోష్ కుమార్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments