మాజీ మంత్రి వనమాతో నామ భేటీ.
పాల్వంచ పట్టణంలో మాజీ ఎంపీ నామ పర్యటన.
Views: 3
On
ఖమ్మం బ్యూరో , మే9 (తెలంగాణ ముచ్చట్లు )
బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం పాల్వంచ పట్టణంలో పర్యటిం
చారు. ముందుగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు స్వగృహానికి వెళ్లి వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. అంతకు ముందు వనమా ఇంటి వద్ద మాజీ ఎంపీ నామ కు పాల్వంచ రూరల్, పట్టణ బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లుకు మాజీ ఎంపీ నామ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీ నామ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజలకు చేరువగా ఉండి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు ఆ తర్వాత పాల్వంచ పట్టణ వాస్తవ్యులు దొప్పలపూడి సురేష్ బాబు-సత్యవాణి దంపతుల కుమార్తె వివాహ వేడుక శనివారం రాత్రి జరగనున్న నేపథ్యంలో ముందుగానే మధ్యాహ్నం వారి స్వగృహానికి వెళ్లి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పాల్వంచ పట్టణ వాస్తవ్యులు రమణమూర్తి నాయుడు నివాసానికి వెళ్లి ఇటీవల ఆయనకు సర్జరీ జరగగా వివరాలు అడిగి తెలుసుకొని వారిని పరామర్శించారు. వైద్యుల సూచనలు పాటించాలని సూచించి తిరిగి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, మోరంపూడి ప్రసాద్ రావు, పాల్వంచ మండల మాజీ అధ్యక్షులు, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గోవాడ గుణచరిత్, సింధు తపస్వి, గుగులోత్ రాంబాబు, కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, మాజీ ఎంపీపీ సరస్వతి, ఉర్దుగా మాజీ చైర్మన్ అన్వర్ భాష, చిన్నంశెట్టి రంగయ్య, రెడ్డి నాయక్, నాయకులు ముత్యాల ప్రవీణ్, దాసరి నాగేశ్వరరావు, వాకదాని కోటేశ్వరరావు, భూక్య వీరన్న, శంకర్, జూపెళ్లి దుర్గాప్రసాద్, హర్షవర్ధన్, ప్రభాకర్ రెడ్డి, పత్తిపాటి శ్రీను, దాసరి సురేష్, బిఎల్ నాయుడు, వంశీ, బొదుగుల శ్రీధర్, కంచర్ల రామారావు, అఖిల్, సేమియా, కాలం రాజమ్మ, ఏనుగుల శీను, ఆర్ఎంపి శీను, హైమద్, బత్తుల శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు
చారు. ముందుగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు స్వగృహానికి వెళ్లి వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. అంతకు ముందు వనమా ఇంటి వద్ద మాజీ ఎంపీ నామ కు పాల్వంచ రూరల్, పట్టణ బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లుకు మాజీ ఎంపీ నామ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీ నామ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజలకు చేరువగా ఉండి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు ఆ తర్వాత పాల్వంచ పట్టణ వాస్తవ్యులు దొప్పలపూడి సురేష్ బాబు-సత్యవాణి దంపతుల కుమార్తె వివాహ వేడుక శనివారం రాత్రి జరగనున్న నేపథ్యంలో ముందుగానే మధ్యాహ్నం వారి స్వగృహానికి వెళ్లి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పాల్వంచ పట్టణ వాస్తవ్యులు రమణమూర్తి నాయుడు నివాసానికి వెళ్లి ఇటీవల ఆయనకు సర్జరీ జరగగా వివరాలు అడిగి తెలుసుకొని వారిని పరామర్శించారు. వైద్యుల సూచనలు పాటించాలని సూచించి తిరిగి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, మోరంపూడి ప్రసాద్ రావు, పాల్వంచ మండల మాజీ అధ్యక్షులు, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గోవాడ గుణచరిత్, సింధు తపస్వి, గుగులోత్ రాంబాబు, కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, మాజీ ఎంపీపీ సరస్వతి, ఉర్దుగా మాజీ చైర్మన్ అన్వర్ భాష, చిన్నంశెట్టి రంగయ్య, రెడ్డి నాయక్, నాయకులు ముత్యాల ప్రవీణ్, దాసరి నాగేశ్వరరావు, వాకదాని కోటేశ్వరరావు, భూక్య వీరన్న, శంకర్, జూపెళ్లి దుర్గాప్రసాద్, హర్షవర్ధన్, ప్రభాకర్ రెడ్డి, పత్తిపాటి శ్రీను, దాసరి సురేష్, బిఎల్ నాయుడు, వంశీ, బొదుగుల శ్రీధర్, కంచర్ల రామారావు, అఖిల్, సేమియా, కాలం రాజమ్మ, ఏనుగుల శీను, ఆర్ఎంపి శీను, హైమద్, బత్తుల శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారుTags:
Related Posts
Post Your Comments
Latest News
09 May 2026 21:42:19
- క్లస్టర్ల వారీగా సమస్యల సేకరణ.. అక్కడికక్కడే పరిష్కారానికి ప్రాధాన్యత
- మే నెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
- తిరుమలాయపాలెం క్లస్టర్...


Comments