రైతాంగ సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం :
మిల్కూరి వాసుదేవరెడ్డి
Views: 9
On
హుజురాబాద్, మే 10(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మండల కమిటీ సమావేశం కొంకటి చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తేమ పేరుతో కోతలు, గన్నీ సంచుల కొరత, రైతులకు సరైన మద్దతు ధర అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు.
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని రైతులకు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రైతుల పక్షాన సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments