ప్రజలతో మమేకమవుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

ప్రజలతో మమేకమవుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

జమ్మికుంట టౌన్ మే 09 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పట్టణంలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. పట్టణ పరిధిలోని 24వ వార్డులో శ్రీ హనుమాన్ భక్తులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు.
అనంతరం చెన్నబోయిన మనోజ్ కుమార్, చరిత దంపతులు నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. తదుపరి పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం ఆనందమయంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా స్థానికులతో ఆత్మీయంగా మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ ప్రజల సుఖదుఃఖాలలో ఎల్లప్పుడూ భాగస్వామ్యం కావడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాలలో బింగీ విశ్వేందర్, బూరుగుపల్లి రాము, పంజాల అనిల్, కౌశిక్, శివ, కపిల్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260509-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .