గడపగడపకు బీఎస్పీ సిద్ధాంతాలు తీసుకెళ్లాలి
నల్లాల శ్రీనివాస్.
Views: 3
On
జమ్మికుంట టౌన్ మే 09 (తెలంగాణ ముచ్చట్లు):
బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం శనివారం జమ్మికుంటలోని ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు మంద సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, పార్లమెంట్ ఇంచార్జ్ దొడ్డసమ్మయాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బహుజన సమాజ్ పార్టీని గ్రామ గ్రామాన, గడప గడపకు తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరియు అగ్రకుల పేదలందర్నీ ఏకం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అసెంబ్లీ కమిటీలతో పాటు సెక్టార్ కమిటీలు, బూత్ కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈనెల 14న కరీంనగర్‌లో ఆదిలాబాద్ జోన్-1 పరిధిలో నిర్వహించనున్న సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ కోరారు.
ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర రథసారథి ఇబ్రహీం శేఖర్, నేషనల్ చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ అతార్ సింగ్ రావ్, కోఆర్డినేటర్ సురేష్ ఆర్య, రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, ఆదిలాబాద్ జోన్-1 చీఫ్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్రం పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, జూపాక గ్రామ ఉపసర్పంచ్ గిన్నారపు మహేందర్, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులు డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), వేల్పుల మల్లేశం, ఎమ్మెల్యే, ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి మారపల్లి మొగిలయ్య, సీనియర్ నాయకులు ఈదునూరి రమేష్, గరిగే చంద్రయ్య, మారముల్లా సదయ్య, రాచపల్లి రమేష్, మామిండ్ల మల్లయ్య, బీఎస్పీ కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు ఉల్లెందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 May 2026 21:42:19
- క్లస్టర్ల వారీగా సమస్యల సేకరణ.. అక్కడికక్కడే పరిష్కారానికి ప్రాధాన్యత
- మే నెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
- తిరుమలాయపాలెం క్లస్టర్...


Comments