గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ గొలిపెల్లి సంపత్.
Views: 3
On
ఎల్కతుర్తి, మే 09 (తెలంగాణ ముచ్చట్లు):
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో నిర్మించుకున్న కొత్త ఇంటిలో లబ్ధిదారులు పట్టెం రజిత–సంపత్ కుటుంబ సభ్యులు గృహప్రవేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొలిపెల్లి సంపత్ కుటుంబ సభ్యులకు బట్టలు అందజేసి అభినందనలు తెలిపారు. కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంత గృహం కల్పించడం ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
గ్రామాల్లో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహప్రవేశాలు జరుపుకోవడం ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిర్ర రాజయ్య, పొలాటి రాజేశ్వర్ రావు, పప్పుల గంగాధర్, కట్కూరి శ్రీలత–శ్రీనివాస్, గోళ్లేనా రాధికా–ఎల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments