పరేడ్ గ్రౌండ్ వైపు కదిలిన కమల దళం.

పరేడ్ గ్రౌండ్ వైపు కదిలిన కమల దళం.

ఎల్కతుర్తి, మే 10 (తెలంగాణ ముచ్చట్లు):
 
ఎల్కతుర్తి మండలం లోని కార్యకర్తలు, ప్రజలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కమల దళం ఉత్సాహంగా వాహనాల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు బయలుదేరింది. పార్టీ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధాని మోడీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినేందుకు యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కార్యకర్తలు సభకు చేరుకోగా, సభ విజయవంతం కావాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ముఖ్య నాయకులు, యువమోర్చా ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .