ప్రజలకు మరింత చేరువగా మున్సిపల్ చైర్మన్.

ప్రజలకు మరింత చేరువగా మున్సిపల్ చైర్మన్.

జమ్మికుంట టౌన్ మే 12 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు గాను స్థానిక 23వ వార్డు పాత మార్కెట్ సమీపంలోని పద్మశాలి భవనం పక్కన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నూతన కార్యాలయ ప్రారంభ మహోత్సవం రేపు అనగా మే 13వ తేదీ ఉదయం 9:51 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యాలయాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రజలు, వార్డు ప్రజలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .