రైతు కష్టానికి ప్రభుత్వం అండగా నిలవాలి”  – బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే.

రైతు కష్టానికి ప్రభుత్వం అండగా నిలవాలి”  – బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే.

జమ్మికుంట టౌన్ మే 12 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట మండలం వావిలాల–వంతడుపుల గ్రామాల మధ్య విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 70 ఎకరాల మక్కా పంట పూర్తిగా దగ్ధమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గోపాల్పూర్, వంతడుపుల గ్రామాలకు చెందిన రైతులు కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని కాలిపోయిన పంట చేలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
“రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు. కష్టపడి పండించిన పంట ఒక్కసారిగా కాలిపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి” అని డిమాండ్ చేశారు.
కన్నీటి పర్యంతమైన రైతులను ఓదార్చిన ఎమ్మెల్యే…
“రైతులు అధైర్యపడొద్దు… మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది” అంటూ భరోసా ఇచ్చారు.
వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారులు వెంటనే పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిక పంపాలని సూచించారు. బాధిత రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం మక్కల కొనుగోళ్ల అంశంపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్ మార్కెట్ యార్డుల్లో మక్కల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు. 41 కిలోల బదులు 43–45 కిలోల వరకు తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో “భరతా” కొరత తీవ్రంగా ఉందని, సరిపడా భరతా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుబంధు విడుదలలో జాప్యం, సాగునీటి కొరత, కరెంట్ సమస్యలు, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఎద్దు ఏడిస్తే వ్యవసాయం ఏడుస్తుంది… రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు” అని మరోసారి గుర్తు చేసిన ఎమ్మెల్యే… రైతులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మరింత కష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు.
ఈ పర్యటనలో కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిల్ రమేష్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ జావిద్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ పావని వెంకటేష్‌తో పాటు వావిలాల తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.IMG-20260512-WA0111
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .