లారీలు లేక మూడు వేల బస్తాలు నిల్వ.!
Views: 28
On
- ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు.
దమ్మపేట, మే 14(తెలంగాణ ముచ్చట్లు):
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ధాన్యం శుభ్రపరిచే విధానం, తూకాల నిర్వహణపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే కేంద్ర నిర్వాహకుడు పోలారావుతో మాట్లాడి ధాన్యం నిల్వలు, రవాణా పరిస్థితులపై ఆరా తీశారు. గత రెండు రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో సుమారు మూడు వేల ధాన్య బస్తాలు కేంద్రంలోనే నిల్వ ఉండిపోయాయని నిర్వాహకుడు వివరించారు. దీనిపై స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా పౌర సరఫరాల అధికారితో ఫోన్‌లో మాట్లాడి వెంటనే మూడు లారీలు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీలో అశ్వారావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు పి. రవికుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ఆరేపల్లి సతీష్, కేంద్ర నిర్వాహకుడు పోలారావు, రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments