ఉచిత మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం.

ఉచిత మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం.

హుజురాబాద్. మే 13(తెలంగాణ ముచ్చట్లు ):
 
హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. కరీంనగర్‌లోని రేణి హాస్పిటల్ లో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ బంగారు స్వామి ఆధ్వర్యంలో ఎడమ కాలి మోకాలి ఆపరేషన్ నిర్వహించారు.
సొల్లు బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది మోకాలి నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. సాధారణంగా మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అయితే డాక్టర్ బంగారు స్వామి, డాక్టర్ రజని దంపతులు తమ తల్లిదండ్రులు బంగారు లక్ష్మి – మైసయ్యల పేరుమీద సేవా కార్యక్రమంగా 200 మందికి పైగా దరఖాస్తులు స్వీకరించి, వారిలో లాటరీ పద్ధతిలో 15 మందిని ఎంపిక చేసి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని వివరించారు.
ఆ ఎంపికైన వారిలో తన పేరు కూడా రావడంతో ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత మాట్లాడుతూ డాక్టర్ బంగారు స్వామి, డాక్టర్ రజని అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. తన భర్తకు విజయవంతంగా చికిత్స అందించిన వైద్యులు మరియు ఆస్పత్రి సిబ్బందికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News