హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్‌కు ఘన సన్మానం.
హుజురాబాద్, మే 16(తెలంగాణ ముచ్చట్లు ):
బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు. బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పూల బోకే అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటీవల బదిలీపై హుజురాబాద్ రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గతంలో హుజురాబాద్ టౌన్ ఎస్ఐగా పనిచేసి ప్రజల ఆదరణ పొందారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారని గుర్తు చేశారు.
ఇకముందు కూడా ప్రజలకు న్యాయం జరిగేలా, సామాన్యుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘం సత్యనారాయణ, హెచ్‌ఆర్‌సీ రమేశ్, మాడుగుల ఓదెలు, మండల అధ్యక్షుడు నడిగోటి రమేష్, బూర్ల చంద్రమౌళి, మండల ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి మామునూరి ప్రవీణ్, ప్రచార కార్యదర్శి పంజాల వెంకటేశ్వర్లు, సొల్లు సల్మోహన్, ఎండీ బాబర్ తదితరులు పాల్గొని సీఐ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


Comments