జూపాకలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహణ.

జూపాకలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహణ.

హుజురాబాద్ రూరల్,మే 17(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉదయం నుంచే గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామంలో పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ.
వనపర్తి,మే17(తెలంగాణ ముచ్చట్లు):  పేదల ఆరోగ్య రక్షణలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.ఆదివారం...
పెట్రోల్, డీజిల్ ధరల భారం మోయలేక ప్రజలు విలవిల.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.
ఎస్సీ వర్గీకరణ అవకాశాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
మందలపల్లి కేసీఆర్ కాలనీలో త్రాగునీటి కష్టాలు.
ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఈనెల 20న దేశవ్యాప్త బంద్.
జూపాకలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహణ.