ఎస్సీ వర్గీకరణ అవకాశాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలి.

ఎస్సీ వర్గీకరణ అవకాశాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలి.

జూలై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-- కొమ్ము చెన్నకేశవులు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు 

వనపర్తి,మే17(తెలంగాణ ముచ్చట్లు): 

మాదిగ సమాజం ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ అవకాశాలను ప్రతి మాదిగ విద్యార్థి, యువకుడు సద్వినియోగం చేసుకొని విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ పిలుపునిచ్చారు.పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల జిల్లా కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి కొమ్ము చెన్నకేశవులు మాదిగ అధ్యక్షత వహించగా, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య మాదిగ, నాయకులు రాజానగరం రాజేష్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా లభించే అవకాశాలపై మాదిగ సమాజంలో విస్తృత అవగాహన కల్పించి, యువతను విద్యా మరియు ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ దిశగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు.అలాగే, రాబోయే జూలై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి మాదిగ పల్లెలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండాలు ఎగురవేయడంతో పాటు, గ్రామ కమిటీలు మరియు జెండా దిమ్మలు లేని ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి 40 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమంగా ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించారు.ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాలపల్లి మన్యం మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, ఎంఎస్ఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు మొలకలపల్లి పరుషరాముడు మాదిగ, ఎమ్మార్పీఎస్ వనపర్తి మండల అధ్యక్షులు మచ్చ తిరుపతి మాదిగ, చిన్నంబావి మండల అధ్యక్షులు దేవని రమేష్ మాదిగ, పెద్దమందడి మండల కన్వీనర్ వెంకట్ రాములు మాదిగ, ఆత్మకూర్ మండల ఉపాధ్యక్షులు కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా నాయకులు వర్మ మాదిగతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .