తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.

తాలు–తరుగు దోపిడీ ఆపకపోతే ఆందోళనలు

-- టీఆర్పీ నేత జి. రవికుమార్ టిఆర్పి జిల్లా యూత్ అధ్యక్షులు 
 
వనపర్తి,మే17(తెలంగాణ ముచ్చట్లు):

అకాల వర్షాలతో తడిసిపోయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు బోనస్ చెల్లించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులపై జరుగుతున్న తాలు–తరుగు దోపిడీ, అక్రమ కోతలు, అవినీతిని తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు.వనపర్తి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాణ్యత పేరుతో తడిసిన ధాన్యాన్ని తిరస్కరించడం రైతు కష్టాన్ని అవమానపరచడమేనన్నారు.కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, గోనె సంచులు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.క్వింటాల్‌కు కోతలు విధించడం బహిరంగ దోపిడీ అని ఆరోపించిన ఆయన, ప్రత్యేక మార్గదర్శకాలతో ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .