పెట్రోల్, డీజిల్ ధరల భారం మోయలేక ప్రజలు విలవిల.

పెట్రోల్, డీజిల్ ధరల భారం మోయలేక ప్రజలు విలవిల.

పెంచిన ధరలను వెంటనే  తగ్గించాలి 

-- మల్లక్ సురేష్ వెల్టూర్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు 

పెద్దమందడి,మే17(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మల్లక్ సురేష్ కేంద్ర ప్రభుత్వంపై ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు.ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ప్రతి రంగంపైనా పడుతోందని, రైతుల నుంచి ఆటో డ్రైవర్లు, కార్మికుల నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరూ ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమై, దాని ప్రభావం నేరుగా ప్రజల జీవన వ్యయంపై పడుతోందని తెలిపారు.ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ధరల పెంపుతో ముందుకు సాగడం బాధాకరమని మల్లక్ సురేష్ విమర్శించారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలకు ఊరటనివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .