విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యం .

సర్పంచ్ శ్వేత శ్రీనివాస్

విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యం .

ఎల్కతుర్తి, మే 17 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వల్లభాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.
పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన డి. కావ్యశ్రీ, ద్వితీయ స్థానం పొందిన ఎ. వైష్ణవి విద్యార్థినులను గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత శ్రీనివాస్, ఉప సర్పంచ్ అంబాల అనిల్ కుమార్ ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేత శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
టాపర్ విద్యార్థినుల విజయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .