ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఈనెల 20న దేశవ్యాప్త బంద్.

ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఈనెల 20న దేశవ్యాప్త బంద్.

హుజూరాబాద్ టౌన్ మే 17 (తెలంగాణ ముచ్చట్లు ):

ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈనెల 20న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు స్థానిక కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాపిరెడ్డి తెలిపారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్‌లైన్ ఫార్మసీలు వైద్యుల ప్రిస్క్రిప్షన్లను సరైన విధంగా పరిశీలించకుండా మందులు విక్రయిస్తున్నాయని ఆరోపించారు. భారీ డిస్కౌంట్ల పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తూ స్థానిక మెడికల్ షాపుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని అన్నారు.
మందుల విక్రయం విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ప్రజలు స్థానిక మెడిక

ల్ షాపులను ప్రోత్సహించాలని కోరారు. ఈ బంద్‌కు మెడికల్ షాప్ యజమానులు, ఫార్మసిస్టులు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .