కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం.

రాబోయే రోజుల్లో ఐ ఎన్ టి యూ సి విజయం ఖాయం

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం.

మంచిర్యాల మే18( తెలంగాణ ముచ్చట్లు)

సింగరేణి కార్మికులసమస్యలుపరిష్కరించడంలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని ఐ ఎన్ టి యూ సి నాయకులు ఆరోపించారు, సోమవారం స్థానిక మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు దేవి భూమయ్య, సమ్మయ్య, నరేందర్ లు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల నుండి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు, దశాబ్దం పాటు  అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్మిక అనుబంధ సంస్థ టీబీజీకేఎస్  కూడా కార్మిక వర్గానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు, అనేక కార్మిక సమస్యలపై పోరాడి విజయం సాధించిన ఐ ఎన్ టి యూ సి సంఘాన్ని విమర్శించడం సరైనది కాదని అన్నారు,
కార్మికుల సమస్యలు కేవలం తెలంగాణ కనీస వేతనాల బోర్డ్ చైర్మన్, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలోనే పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు, డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ఐఎన్టీయూసీ నిరంతరం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని సంబంధిత అధికారులను, మంత్రులను ఎప్పటికప్పుడు కలిసి కార్మికుల సమస్యలను తెలియజేస్తున్నామని గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, శ్రీనివాస్,  ఒదెలు, చంద్రశేఖర్, బిక్షపతి  తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .